ఆగస్టు నెలలో పుట్టారా? ఐతే నిర్మొహమాటముగా మాట్లాడేస్తారు!

సోమవారం, 7 జనవరి 2013 (16:48 IST)
FILE
ఆగస్టు నెలలో జన్మించిన జాతకులు శక్తి, ఉత్సాహము, ధైర్య సాహసములను కలిగివుంటారు. ఉదారత, మానవత్వము, దృఢ నిశ్చయము వీరి సహజ లక్షణములు. తమ బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వహించగలే సత్తా కలవారు. వీరికి పెత్తనము చెలాయించే స్వభావము. దయాదాక్షిణ్యములు కలిగివుంటారు.

ఎలాంటి పనినైనా నిర్భయముగా చేస్తారు. వీరికి గర్వము, దర్పము, డాంబికము ఎక్కువగా ఉండును. అన్ని విషయాలలోనూ ప్రజ్ఞ సంపాదించగల దిట్టలు. పట్టుదల కలిగివుండే వీరు... సమయం వచ్చినప్పుడు శత్రువులైనానూ క్షమించగలరు.

వీరు ఉదార స్వభావము, ధార్మిక బుద్ధి గలవారు. నిగ్రహ శక్తి వీరికి ఎక్కువ. పనులను నిర్వహించడంలో పట్టుదలతో అనుకున్న గడువులోపే పూర్తి చేస్తారు. నిర్మొహమాటముగా, నిర్భయంగా మాట్లాడే ఈ జాతకులు పేరు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. తలకు మించిన పనులతో ఎప్పుడూ బిజీ బిజీగా కనిపించే వీరు ఆ పనులు లేనప్పుడు మందముగాను, విచారముగా కనిపిస్తారు. గొప్పవారితో పరిచయములు, విదేశ ప్రయాణాలుంటాయి.

వీరికి 11 నుంచి 17వ సంవత్సరము వరకు విద్యారంగమందు అభివృద్ధి ఉంటుంది. 24కి తర్వాత వివాహం అవుతుంది. 37వ సంవత్సరము నుంచి అదృష్ట యోగ దశ ప్రారంభించును.

వెబ్దునియా పై చదవండి