కవల పిల్లలు ఏ జాతకులకు జన్మిస్తారో మీకు తెలుసా?

మంగళవారం, 8 జనవరి 2013 (16:43 IST)
FILE
సాధారణంగా దంపతులకు కవల పిల్లలు పుడుతారా అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణించవచ్చా అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. రాశుల్లో ఏక, ద్వంద రాశులున్నాయి. మిథునం, తులాం, మీనం ఇవన్నీ ద్వంద రాశుల కిందకు వస్తాయి. మిథునం అంటే ద్వంద రాశి. ఈ రాశి బొమ్మను చూస్తే ఇద్దరు పిల్లల బొమ్మను కలిగివుంటుంది.

తులాం కూడా రెండు త్రాసులను కలిగివుంటుంది. ఇక మీనం కూడా రెండు చేపల బొమ్మను కలిగివుంటుంది. ఇవన్నీ రాశుల్లో ద్వంద రాశులుగా పరిగణించబడుతున్నాయి. అయితే జాతక ప్రకారం ఐదో స్థానమైన పుత్ర స్థానం ద్వంద రాశిని కలిగివుంటే.. ఆ జాతకులకు కవల పిల్లలు జన్మిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుచేత జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కవల పిల్లలు జన్మిస్తారా లేదా అనేది జాతకం ప్రకారం చెప్పవచ్చునని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి