కుంభరాశి జాతకులు వ్యక్తిగత స్వేచ్ఛనే ప్రేమిస్తారట!

FILE
కుంభరాశి జాతకులు వ్యక్తిగత స్వేచ్ఛనే ప్రేమిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మోస్తరు అందాన్ని కలిగివుండే ఈ జాతకులు ఎత్తుగా ఉంటారు. స్నేహితులు వీరికి కొదవుండదు. వీరి స్నేహితులు ఉన్నత పదవులు, ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇతరుల కష్టాన్ని భరించలేని ఈ జాతకులు, సహాయం చేసేందుకు ముందుంటారు. అయితే తలనొప్పి, అజీర్తి, ఉదర సంబంధిత వ్యాధులతో ఈ జాతకులు బాధపడే అవకాశం ఉంది.

ఈ జాతకులకు ఆధ్యాత్మిక చింతన అధికం. ఇతరులచే జెంటిల్మెన్ అనిపించుకునే వ్యక్తిత్వం కలిగివుంటారు. వీరి జీవితాంతం ఆదాయానికి ఎలాంటి లోటుండదు. ప్రాక్టికల్‌గా మాట్లాడే నైజం కలిగివుండే కుంభరాశి జాతకులు.. ఇతరులను ఆకట్టుకునే వాక్చాతుర్యతను కలిగివుంటారు. ఈ జాతకులకు శనిగ్రహం ఆధిపత్యం వహించడంతో ప్రతి శనివారం శనిగ్రహ అనుగ్రహం కోసం నువ్వుల దీపం వెలిగించడం, నువ్వులను దానం చేయడం వంటివి చేస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

వెబ్దునియా పై చదవండి