పూజగది గడపను పసుపు కుంకుమలతో ఎందుకు అలంకరిస్తారు?

మంగళవారం, 15 జనవరి 2013 (18:53 IST)
FILE
పూజగది గడపను పసుపు కుంకుమలతో అలంకరించడం ఆధ్యాత్మికంగా సుఖసంతోషాల కోసమేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ గృహం సిరిసంపదలతో తులతూగాలంటే ఇంటి సింహద్వారంతో పాటు పూజగది గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకుని ప్రతి నిత్యం పూజ చేయాలని వారు అంటున్నారు.

అలాగే గడపకు పసుపు కుంకుమల్ని పెట్టడం ద్వారా బయటి వాతావరణంలోని పొల్యూషన్‌ని పసుపు-కుంకుమలు అడ్డుకుంటాయి.

అవి పలచని పొరగా గాలిలో ఏర్పడి ద్వార బంధాలకు అడ్డుగా ఉండి గూటిలోపలి వాతావరణాన్ని అలాగే పూజగది లోపలి వాతావరణాన్ని శుద్ధంగా ఉండేలా బ్యాక్టీరియాలు లోనికి రాకుండా చేస్తాయి. పసుపులోని ఆంటిబయాటిక్‌కు ఇలా కాపాడే గుణం ఉందని పంచాంగ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి