మీరు మేషరాశి జాతకులా.. అయితే ధనవంతులే!

శనివారం, 17 మే 2014 (14:47 IST)
FILE
మేషరాశిలో జన్మించిన జాతకులకు ఆస్తి కొదవంటూ ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశిలో జన్మించిన జాతకులు భూమి, ఆభరణాలు, వాహనాలను కలిగివుంటారు. వీరికి ధనవంతులుగా సామాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యాపారంలో రాణిస్తారు. యజమానులుగా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగానూ రాణిస్తారు. అయితే తొందరపాటు, కోపం వంటి లక్షణాలు కలిగివుంటారు. సంప్రదాయ విలువలను గౌరవిస్తారు.

అదే ఆడవారికైతే బంగారం, పట్టు వస్త్రాలు, ఆభరణాలకు లోటుండదు. విద్యావంతులైన మేషరాశి జాతకులు శ్రమజీవులు కావడంతో సుఖమయ జీవితాన్ని గడుపుతారు.

వెబ్దునియా పై చదవండి