మేషలగ్న జాతకుల ఫలితాలు...!

మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (19:19 IST)
WD
మేషలగ్నజాతకులు సామాన్య దేహము విశాల ముఖం కలిగి, పొడవైన మెడ, బిరుపైన వెంట్రుకలు, కనుబొమ్మలు ఉత్తుగాకలిగి ఉంటారు. కొద్దిగా పసుపురంగు కళ్లు కలిగియుంటారు. శిరస్సుకు, ఉదరమునకు సంబంధించి వ్యాధులు కలిగిఉందురు. ఈ మేషలగ్నాది జాతకుల శరీరంలో కర్ర, కత్తి, అగ్ని తదితర వాటివల్ల కలిగిన దెబ్బగుర్తులు ఉండును. ఓర్పు తక్కువ, ఆలోచనాపరులుగా ఉంటారు.

శిరస్సు ముఖముపైన మొటాలతో మచ్చలు కలిగి ఉంటారు. ప్రతిపనిలో ఆసక్తి కలిగియుందురు. శరీరము సన్నగా ఉన్ననూ చురుకుగా ఉందురు. ప్రతి పనిలో ముందు వెనుకల ఆలోచించకుండ వెంటనే ప్రారంభింతురు. వీరు అత్యాసపరులుగా ఉండి, ఆశించిన ఫలితము దక్కకున్నచో మిక్కిలి మనోవ్యాకూలత చెందుతారు. చంచల మనస్సు కలిగి ఉండుటచే ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోతుంటాయి.

కాగా వీరికి పట్టుదల చాలా అవసరం. ఎదుటివారి దోషాలను వెంటనే గ్రహించు సామర్థ్యం కలిగి ఉందురు. దీనిచే వీరికి శత్రువర్గాలు అధికంగా ఉండును. వీరు తగువులకు కూడా ముందుగా ఉంటారు. మిక్కిలి కోపస్తులు, సహనము తక్కువగా ఉండును. ఎదుటివారి ఆధిపత్యాన్ని చూసి సహించలేరు. విచక్షణా జ్ఞానం లోపించుటవల్ల ఒడిదుడుకులకు లోనగుచుందురు.

వీరి ఆలోచనలు ఒక క్రమపద్దతికి పెట్టుకున్నాగాని విజయం సాధించలేరు. చెడుస్నేహం వల్ల సష్టాలు కలుగును. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు స్వభావం కలవారుగా ఉంటారు. నిగూఢ విషయాల్లోకూడా గ్రహించగల నేర్పులు. వీరు పని చేయుటకంటే ఇతరులతోచేయించు నేర్పరితనం కలవారు. విజయసాధనకు పోటీపడుట వీరి స్వభావం. ఒకరి నాయకత్వాన్ని ఈ రాశివారు అంగీకరించరు.

వెబ్దునియా పై చదవండి