వృషభలగ్నజాతకుల ఫలితాలు!

గురువారం, 4 సెప్టెంబరు 2008 (19:07 IST)
వృషభలగ్న జతకస్తుల వారికి స్థిరమమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. పట్టిన పట్టు విడువరు. తమ మనస్సులో భావనను ఇతరులకు పొక్కనివ్వరు. తమ మనస్సులోని భావనలకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతారు.

ఇతరుల మాటను వింటారు కానీ, తమ అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటారు. ఎన్నికష్టాలు వచ్చిననూ సహనాన్ని వీడరు. లక్ష్యసాధనలో ఎన్ని అటంకాలు వచ్చినా లెక్కచేయక లక్ష్యంపైనే దృష్టి సారిస్తారు. ఇతరుల కార్యాలను గ్రహించగల నేర్పులు. శ్రమ ఓర్పు కల్గిఉందురు. ధనవస్తువాహనాలకు గౌరవిస్తారు. ఎక్కువగా కష్టపడుతారు. తమ ఆర్థిక స్థితిగతులను ఇతరులకు తెలియనివ్వరు.

ఈ జాతకులు 40 సంవత్సరాల తర్వాత సంపదతో జీవితంలో స్థిరపడుతారు. స్నేహితులు ఎక్కువగానే ఉందురు. ఈ జాతకులకు ప్రత్యక్ష శత్రువులు ఉండరు. ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటారు. సంగీతమందు ఆసక్తి కల్గివుందురు. అధిక మిత్రుల వల్ల ధననష్టాలు కలుగును.

వెబ్దునియా పై చదవండి