శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే!

బుధవారం, 10 ఆగస్టు 2011 (14:55 IST)
FILE
శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీదేవికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ధనవృద్ధి జరుగుతుంది. శ్రావణ శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజను చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంతో పెరుగన్నాన్ని దానం చేస్తే మీ ఇంట్లో ధన వృద్ధి చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.

అలాగే కులదేవతలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శనివారం రోజు కులదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అప్పుల బాధలు ఉండవు. పెరుగన్నాన్ని దానిమ్మ పండు గింజలను కలిపి కులదేవతలకు నైవేద్యం చేసి, దానం చేస్తే శత్రువుల బాధ తొలగిపోతుంది.

ఇంకా శనివారం రోజు స్టీలు పళ్లెంలో అరటి ఆకు పెట్టి దానిపై పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలంతో కలిపి దానం చేస్తే అన్ని రకాల మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు త్వరగా నయమవుతాయి.

సిద్ధి వినాయకస్వామిని స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సమయంలో పెరుగన్నం నైవేద్యంగా చేసి తిన్నా-దానం చేసినా మీ ఇంట్లో ప్రశాంతత, శాంతి, సంతోషం నెలకొంటాయి. అమావాస్య రోజు, మహాలయ పక్షాల సమయంలో పెరుగన్నం దానం చేస్తే అన్ని పితృశాపాలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి