శ్రీ కృష్ణునికి అటుకుల అన్నం నైవేద్యంగా పెడితే..!?

సోమవారం, 10 అక్టోబరు 2011 (17:18 IST)
FILE
శ్రీ కృష్ణునికి అటుకుల అన్నం, బెల్లం, కొబ్బరి తురుమును వేసి నైవేద్యంగా పెడితే అప్పుల బాధ ఉండదు. ఈ ప్రసాదాన్ని తినే వారి ఇంట్లో భాగ్యం పెరుగుతుంది. ఇంట్లోని వారందరూ సుఖంగా ఉంటారు. అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి. ఆ గృహంలోని మహిళలకు ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

తీపి అటుకుల అన్నానికి తేనెను వేసి కలిపి శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని పంచి ఇంట్లోని వారందరూ తింటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఆదాయం అధికంగా ఉండి ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ డబ్బు మిగులుతుంది.

తీపి అటుకుల అన్నాన్ని తేనెను అరటికాయను వేసి కలిపి శ్రీ పార్వతి పరమేశ్వరులకు నైవేద్యంగా పెట్టి వృద్ధ బ్రాహ్మణ దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ప్రసాదాన్ని పెట్టి పెళ్లి కాని అబ్బాయి, అమ్మాయిలకు ఇస్తే త్వరగా వివాహం అయి సుఖమయ దాంపత్య జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి