సత్య సాయిబాబా త్వరలో కోలుకుంటారు: జ్యోతిష్యులు

FILE
అనారోగ్యంతో వారం రోజుల పాటు సతమతమవుతున్న పుట్టపర్తి సత్య సాయిబాబా త్వరలో కోలుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య గణాంకాల ప్రకారం సత్యసాయి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ త్వరలో కోలుకుంటారని అంటున్నారు.

పుట్టపర్తి సత్య సాయిబాబు జాతకం షిరిడీ సాయి జాతకానికి దగ్గరగా ఉందని, ఈ జాతకం ప్రకారం ప్రస్తుతం సత్యసాయికి శని అంతర్దశ జరుగుతోందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.

ఈ శని అంతర్దశ ప్రభావంతో సత్యసాయికి తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవు. కానీ త్వరలో కోలుకుంటారని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. 2011 జూలై వరకు సత్యసాయికి శని అంతర్దశ జరుగుతుంది.

నవంబర్ 23, 1926వ సంవత్సరంలో జన్మించిన సత్య సాయిబాబా అనారోగ్యానికి గురికావడం జాతక ప్రభావంతోనేని, కానీ ఏప్రిల్ 15 లోపు సత్య సాయిబాబా కోలుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి