శుభోదయం.. నేటి దినఫలితాలు.. మధ్యవర్తులతో జాగ్రత్త...
గురువారం, 16 నవంబరు 2017 (06:17 IST)
మేషం: ఉమ్మడి వెంచర్లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలసిరాగలదు. వ్యవసాయ రంగంలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
వృషభం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణయత్నాలు, విదేశీయానం అనుకూలిస్తాయి. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లుగానే వుంటాయి.
మిథునం: చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. మీ సంతానం విద్య, విషయాల పట్ల దృష్టి సారిస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం: భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు తప్పవు. మీ సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో మెలకువ, వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు తోటివారి నుండి ఆహ్వానాలు అందుతాయి.
సింహం: శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. కొబ్బరి, పండ్ల పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించటానికి మరికొంత కాలం పడుతుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు, పరిశ్రమలకు అవసరమైన లైసెన్సులు అనుకూలిస్తాయి.
కన్య: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు ఒక ప్రకటన వల్ల ఆకర్షితులవుతారు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు.
తుల : ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ప్రైవేట్, పత్రిక సంస్థల్లోని వారికి రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం: రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను గౌరవం ఏర్పడుతుంది. సోదరులు మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
ధనస్సు: కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఏకీభావం ఉండదు. ఉపాధ్యాయులు కొత్త కొత్త పథకాలు అమలు చేస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు.
మకరం: కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తులు, వ్యవసాయ కూలీలకు ఆటుపోట్లు తప్పవు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీ యత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు.
కుంభం: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నం వాయిదా వేయడం మంచిది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
మీనం : ఉపాధ్యాయులకు పరస్పర అవగాహన లోపం. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మెళకువ వహించండి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించగలుగుతారు. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది.