శనివారం రాశిఫలాలు : దేవి ఖడ్గమాల చదివితే...

శనివారం, 9 డిశెంబరు 2017 (06:00 IST)
మేషం : ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు. బంధు మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించండి. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
వృషభం : మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
మిథునం : వృత్తి వ్యాపార, వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీల్లో ఉమ్మడి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పనుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించండి శ్రేయస్కరం. మీ అభిప్రాయాలు గుట్టుగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
సింహం : విద్యార్థులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా పోవాలి. వీలైనంతవరకు బయట ఆహారాన్ని భుజించకండి. విద్యార్థుల్లో ఉన్నత చదువుల పట్ల ఒక అభిప్రాయం నెలకొంటుంది. 
 
తుల : మిమ్మలను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. వ్యాపారాలు, ప్రాజెక్టులకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. ఆపత్సమయంలో అయినవారు అండగా నిలబడతారు. తలపెట్టిన పనులపై ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం : అవతలి వారి సంభాషణ మీ గురించేనన్న అనుమానంతో సతమతమవుతారు. పరిచయాలు, వ్యాపకాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఏ పని తలపెట్టినా మొదటికే మోసం వస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త ఉండాలి. 
 
ధనస్సు : కోర్టు, స్థల వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో ఏకాగ్రత లోపం, మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. నిస్తేజం వీడి ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. అధికారులకు అదనపు బాధ్యతలు, స్థానచలనం వంటి మార్పులున్నాయి. రాజీమార్గంలో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
మకరం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. చిన్నారుల, ఆత్మీయులకు విలువైనకానుకలు అందిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. 
 
కుంభం : స్థల వివాదాలు, ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ప్రేమికులు పెద్దలతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సంతోషకరమైన వార్తలు వింటారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. 
 
మీనం : ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు