కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ తగ్గించే గుణం ఉండటం వల్ల ప్రతి కార్యంలో ఈ కర్పూరాన్ని ఉపయోగించడమే కాకుండా పూజా కార్యక్రమాలలో, కర్పూర హారతులను ఇస్తుంటారు. కర్పూరంతో వివిధ రకాల దోషాలను తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తరచూ ప్రమాదాలకు గురయ్యే వారు.. వాటి నుంచి బయటపడటం కోసం కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీమాతకు సమర్పించడం వల్ల ప్రమాద దోషాలు తొలగిపోతాయి.
ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, ఎంత సంపాదిస్తున్నా చేతిలో డబ్బు నిలవకుండా ఉన్నవారు కర్పూరాన్ని వెలిగించి అందులో నాలుగు లవంగాలను కాల్చాలి. ఈ విధంగా కాల్చిన వాటిని రాత్రి నిద్రపోయే ముందు వాటిని ఇంటి బయట పడేయటం వల్ల మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ధన సంపాదన కూడా మిగులుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.