శుక్రవారం రాశి ఫలాలు (23-03-18) - విద్యార్థులు భయాందోళనలు...

శుక్రవారం, 23 మార్చి 2018 (08:57 IST)
మేషం : విద్యార్థుల భయాందోళనలు వీడి శ్రమించినా సత్ఫలితాలు లభిస్తాయి. సంఘంలోనూ కుటుంబంలోనూ మీ మాటకు ఆదరణ లభిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
వృషభం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. వస్త్రం, బంగారం, వెండి, లోహ పనివారలకు, వ్యాపారులకు శుభదాయకం. బ్యాంకింగ్, చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. 
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. స్త్రీలు ఎదుటివారి ప్రభావానికి లోనుకాకుండా ఉండటం మంచిది. 
 
కర్కాటకం : మీ జీవిత భాగస్వామితో కీలకమైన విషయాలపై చర్చలు జరుపుతారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. స్త్రీలు తెలియని అశాంతికి లోనవుతారు. కొబ్బరి, పండ్లు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయాన ప్రయాణానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
సింహం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మలను వరిస్తుంది. 
 
కన్య : ఆర్థిక విషయాలలో ఆశించినంత సంతృప్తికానరాదు. ఆస్తి పంపకాల విషయంలో సోదరీసోదరుల మధ్య ఒప్పందం ఖరారవుతుంది. కష్టసమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. వివాహ వేదికల కోసం యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
తులం : సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రముఖుల పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సోదరీసోదరులతో ఏకీభవించలేక పోతారు. సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటివరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పుగమనిస్తారు. 
 
వృశ్చికం : గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. బ్యాంకు పనులు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో మెలకువ వహించండి. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. కళ, క్రీడ, సాంకేతిక, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలకు తల, కళ్లు నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 
 
మకరం : ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల వల్ల క్షణం తీరిక ఉండదు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. కోర్టు వాయిదాలు ఉపసంహరించుకుంటారు. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అవివాహితుల్లో నూతనోత్సాహం, పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. 
 
కుంభం : బ్యాంకు పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం. ఉంది. మెళకువ వహించండి. 
 
మీనం : ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖతో అవగాన లోపిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం వరిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు