గురువారం (02-08-2018) దినఫలాలు - మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా...

గురువారం, 2 ఆగస్టు 2018 (08:54 IST)
మేషం: వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి కలిసిరాగలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. కార్మికులకు, తాపీ పనివారికి సమస్యలు తలెత్తుతాయి. 
 
వృషభం: ఆర్ధికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. మీ సంతానం మెుండి వైఖఱి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం: సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమయినదని గమనించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.  
 
కర్కాటకం: వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అపార్ధాలు మాని ఇతరులను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఎల్.ఐ.సి పోస్టల్, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దంపతుల మధ్య అపార్ధాలు తలెత్తుతాయి. 
 
సింహం: ఆర్ధిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి. భావోద్వేగాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలం. బంధుత్వాల మధ్య ఏర్పడిన పరిస్థితులు తీరిపోతాయి. 
 
కన్య: ఆర్ధిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు మేలు చేసిన అపవాదులపాలవుతారు. మీకున్న కళానైపుణ్యతలను ఇతరులు మెచ్చుకునేలా చక్కగా ప్రదర్శిస్తారు. స్త్రీలకు ఆత్మీయుల నుండి ఆహ్వానాలు, వస్త్రలాభం, వాహన యోగం వంటి శుభ ఫలితాలున్నాయి.  
 
తుల: రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రత్యర్ధులు మిత్రులుగా మారుతారు. నిరుద్యోగులకు కలిసివచ్చే కాలం. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. 
 
వృశ్చికం: ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టులు చివరిలో దక్కుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఒడిదుడుకులను ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: ఆస్తి వ్యవహారాల్లో దాయాదులతో జాగ్రత్తగా వ్యవహరించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. 
 
మకరం: ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్వయంకృషితో రాణిస్తారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. క్రమంగా అన్నివిధాలా చురుగ్గానూ, ఉత్సాహంగానూ జరుగుతాయి. 
 
కుంభం: ఆర్ధిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదాపడుట మంచిదని గమనించండి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారదిశగా నడుస్తాయి. 
 
మీనం: బ్యాంక్ ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అనుకూలిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింతముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. మీ ఆలోచనా దృష్టిని మరికాస్త పెంపొందించుకోండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు