02-09-2018 ఆదివారం నాటి దినఫలాలు - మంచి మాటలతో...

ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (10:13 IST)
మేషం: ముఖ్యులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. మంచి మాటలతో ఎదుటివారని ప్రసన్నం చేసుకోవడానికి యత్నించండి. విద్యార్థులకు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్పలితాలిస్తాయి.
 
వృషభం: వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. హామీలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మిధునం: ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభారం కుదరదు. నూతన వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ సమస్య ఒకటి సానుకూలం కావడంతో మానసికంగా కుదుటపడుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 
 
కర్కాటకం: ఆర్థిక ఒడిదుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. మీరు చేసే యత్నాలకు సన్నిహితుల నుండి సహకారం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక, క్రీడా, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.  
 
సింహం: రాజకీయనాయకులు సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి సామాన్యం. దంపతుల మధ్య అవగాహనలోపం చికాకులు వంటివి చోటు చేసుకుంటాయి.  
 
కన్య: ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. మిత్రులతో సంభాషించడం వలన మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.    
 
తుల: సాంఘి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్పలితాలనిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. 
 
వృశ్చికం: ఇరుగు పొరుగు వారి వైఖరి వలన ఒకింత ఇబ్బందులు తప్పవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడడం మంచిది. 
 
ధనస్సు: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రుణ యత్నాల్లో అలసత్వం వంటి చికాకులను ఎదుర్కుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. క్లిష్టమైన పనుల్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి.   
 
మకరం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహానం కలిగిస్తాయి. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవడం ఉత్తమం. ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.  
 
కుంభం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిగిరాగలదు. ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆదిపత్యం చెల్లదు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మీనం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిగిరాగలదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. పద్ధతిలోనే గుణపాఠం నేర్పవచ్చు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు