03-04-2020 శుక్రవారం మీ రాశిఫలాలు

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. వ్యాపార వర్గాల వారికి పన్నులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి, సమస్యలు అధికం. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. 
 
వృషభం : విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. మీరంటే గిట్టని వ్యక్తులను సైతం ఆకట్టుకుంటారు. పెరిగిన ధరలు, విద్యుత్ బిల్లులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులను సాయం అడగటానికి బిడియపడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్థల స్థాపన విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మిథునం : యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంతానం భవిష్యత్ కోసం పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రిటైర్డ్ ఉద్యోగస్తులు, అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం : ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం, చికాకులు అధికం. స్త్రీలు, కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
సింహం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అధికారులకు ఒత్తిడి, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు అధికం. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికిరావు. 
 
కన్య : బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. రహస్య విరోధులు, అధికంకావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. దూర ప్రయాణాలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
తుల : ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహనానికి లోనవుతారు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ వాతావరణం అధికం కావడంతో ఆందోళన చెందుతారు. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్లు అధికం. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. ఎటువంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : మీ కళత్ర పట్టుదల, సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. వివాహ సంబంధమై దూర ప్రాంతాల ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
ధనస్సు : ఏసీ, కూల, విద్యుత్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పాత పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన మీ ధ్యేయం నెరవేరగలదు. 
 
మకరం : దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసినగాని నిలదొక్కుకోలేకు. వాగ్వివాదాలకు ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి. 
 
కుంభం : బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షలలో మెళకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. రుణాల కోసం యత్నిస్తారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మీనం : పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయడం మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు