06-08-2020 గురువారం రాశిఫలాలు - మీ కళత్ర మొండివైఖరి...

గురువారం, 6 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు, టీవీ, చానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
వృషభం : కష్టపడి పని చేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు సదావకాశాలు లభిస్తాయి. ముఖ్యుల కోసం మీ పనుల వాయిదా వేసుకోవలసి వస్తుంది. రావలసిన మొండిబాకీలు వసూలవుతాయి. 
 
మిథునం : స్త్రీలకు నూతన సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. 
 
కర్కాటకం : ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
సింహం : బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సివస్తుంది. కుటుంబీకులతో అవగాహనా లోపం వంటివి ఎదుర్కొంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : చేతిలో ధనం నిలవటం కష్టమవుతుంది. విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. క్రీడ, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. స్త్రీలు కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. ఇతరుల మీ పట్ల ఆకర్షితులవుతారు. 
 
తుల : రుణాలు, చేబదుళ్లు తప్పక పోవచ్చు. వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు అధికం. ఆస్తి, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరీ, సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
వృశ్చికం : వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. స్త్రీలకు అయినవారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు సహచరులు, నూతన వాతావరణానికి క్రమంగా అలవాటుపడతారు. 
 
ధనస్సు : పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. 
 
మకరం : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. ఫ్లీడరు నోటీసులకు ధీటుగా స్పందిస్తారు. భేషజాలకు పోకుండా ఇతరుల సహాయాన్ని స్వీకరించండి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. 
 
కుంభం : అధికారుల సుధీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళనకు గురిచేస్తాయి. 
 
మీనం : నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలంకాగలదు. తొందరపాటుతనం వల్ల ధననష్టంతో పాటు మాటపడవలసి వస్తుంది. పెద్దలు, మీ శ్రీమతి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు