08-05-2020 శుక్రవారం దినఫలాలు - సరస్వతిదేవిని ఆరాధిస్తే...

శుక్రవారం, 8 మే 2020 (05:00 IST)
మేషం : వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. ఎంతో కొంత పొదువు చేయడం మంచిది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. సామాజిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. 
 
వృషభం : బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సందేహాలువీడి నమ్మకంతో యత్నాలు సాగించండి. 
 
మిథునం : శత్రువులపై విజయం సాధిస్తారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికం. స్త్రీలకు సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. కిరాణా ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. 
 
సింహం : చేతి వృత్తి వ్యాపారులకు పనిభారం అధికమవుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు దొర్లుట వల్ల పైఅధికారులతో మాటపడాల్సి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
కన్య : ఆర్థిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించడి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
తుల : ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసి వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ, సహాకారాలు అందిస్తారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా తాత్కాలికమేనని గమనించండి. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుపటపడుతారు. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మిత్రుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
ధనస్సు : ధనం ఏం కొంతైనా పొదువు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ సంతానం మొండివైఖరి వల్ల అసహనానికి గురవుతారు. స్నేహితులు మీ జీవితానికి మూలస్తంభాలుగా మారుతారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 
 
మకరం : విదేశాలు వెళ్లడానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. మీ పనులు ఇతరులకు అప్పగించడం మంచిదికాదు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. వైద్యులకు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
కుంభం : ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. కొబ్బరి, చల్లని పానీయాలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకింగ్ రంగాల వారికి తమ పనుల్లో ఏకాగ్రత అవసరం. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం : ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వృత్తుల, ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు