09-01-2019 బుధవారం దినఫలాలు - వారసత్వపు వ్యవహారాల్లో...

బుధవారం, 9 జనవరి 2019 (08:22 IST)
మేషం: ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మీ మనోభావాలు బయటికి వ్యక్తం చేయకండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి బాకీలు వసూలు విషయంలో సమస్యలు తప్పవు. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
 
వృషభం: నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వలన ఆందోళనకు గురవుతారు. మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
మిధునం: ఎలక్ట్రికల్ రంగాలలో వారికి సామాన్యంగా ఉండగలదు. సోదరీసోదరుల మధ్య అనురాగవాత్సల్యాలు పొందగలవు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వలన ఆందోళనకు గురవుతారు. 
 
కర్కాటకం: వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, కార్మికులకు శ్రమాధిక్యత చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలు వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. మీ పట్ల మూభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు.  
 
సింహం: నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తారు. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.  
 
కన్య: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. తలపెట్టిన పనులలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు తోటి పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడుతాయి. 
 
తుల: వారసత్వపు వ్యవహారాల్లో చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థులకు మిత్రబృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి.  
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపాకాలు అధికమవుతాయి. అక్రమ సంపాదనపై దృష్టి పెట్టకపోవడం మంచిది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
ధనస్సు: బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూరప్రయాణాలలో చికాకులు తప్పవు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సభ, సమావేశాలలో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
మకరం: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు చక్కగా నిర్వహిస్తారు. ఎప్పటి నుండో వేధిస్తున్న సమస్యలు పరిష్కారదిశగా ముందుకు కొనసాగుతాయ. స్త్రీలు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయాల వారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కొనక తప్పదు.    
 
కుంభం: మీ శ్రీవారి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చడం వలన మాటపడవలసి వస్తుంది.   
 
మీనం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. గృహంలో మార్పులకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టునప్పుడు పునరాలోచన మంచిది. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు