12-04-2020 ఆదివారం మీ దినఫలాలు - ఆదిత్య హృదయం వింటే సర్వదా శుభం

ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : కొత్త వ్యక్తుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. మత్స్యుకోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
వృషభం : ఇంటా, బయట కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రులు సహకారం వల్ల సమసిపోగలవు. 
 
మిథునం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సిమెంట్, స్టాకిస్టులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు. 
 
కర్కాటకం : బంధుమిత్రుల కలయిక వల్ల ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు కలిసిరాగదలు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రాలవసిన ధనం కొంత ముందు వెనుకాలగానైనా అందుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. 
 
సింహం : ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. దైవ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. 
 
తుల : ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలు విందు వినోదాలలో చురుకుగా వ్యవహరించి పలువురుని ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం : రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. స్త్రీల వాక్‌చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎటువంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొంటారు. గృహంలో ఒక శుభకార్యం సానుకూలమవుతుంది. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. 
 
ధనస్సు : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. రుణయత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
మకరం : నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. పాత మిత్రులతో కలిసి విందు, వినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కుంభం : ఆత్మీయులను విమర్శించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు ధరలు అధికమవుతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గృహానికి కావలసిన వస్తువులను కొంటారు. 
 
మీనం : నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. మధ్యవర్తిత్వం వహించుట మంచిదికాదు. విదేశాలు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు