12-7-2019- శుక్రవారం దినఫలాలు - ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో..

శుక్రవారం, 12 జులై 2019 (08:57 IST)
మేషం : ఆర్ధిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రలోభాలకు లొంగవద్దు. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. విద్యాసంస్థలలోని వారికి అనుకూలంగా వుండగలదు.
 
వృషభం : ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండిధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. మీ మనోభావాలను బయటివారికి అర్ధమయ్యేతీరులో వ్యవహరించండి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
మిథునం : స్ధిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. పాత సమస్యలు పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభాదాయకం. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. 
 
కర్కాటకం : కుటుంబంలోను, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ వాహనం ఇతరులకుచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతోకాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి. బ్యాంకు పనులు వాయిదా పడతాయి.
 
సింహం : మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధిమవుతుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్,  మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. భాగస్వామిక వ్వాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య : ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. ఖర్చులు అధికం. కొంత మంది మీ నుండి విషయాలు రాచట్టటానికి యత్నిస్తారు. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం.
 
తుల : ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి అనునయంగా చెప్పటం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందు లెదుర్కుంటారు. ఆదాయానికి మించి ఖర్చు లుంటాయి. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల విషయంలో చికాకులు తప్పవు.
 
వృశ్చికం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. దంపతులు సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవటం క్షేమదాయకం. రాబోయే అవసరాలకు ఇప్పటి నుంచే ధనం ఉంచుకోవటం మంచిది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. గతస్మృతులు జ్ఞప్తికి వస్తాయి.
 
ధనస్సు : పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఆచతూచి వ్యవహరించండి. గట్టిగా ప్రయత్నిస్తేనే కాని మొండు బాకీలు వసూలు కావు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
 
మకరం : ఆర్థిక, కుటుంబ, వ్యాపారా వ్యవహారాల పట్ల ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. కొత్త పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల ఆశక్తి నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహరాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు.
 
కుంభం : పన్నులు, రుణచెల్లింపులు వాయిదా వేయకండి. ఆలయాలను సందర్శిస్తారు. మీ ఆశయసాధనకు నిరంతర కృషి, పట్టుదల ముఖ్యం. రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఏమీనం ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలతో మితంగా సంభాషించటం అన్ని విధాలా మంచిది.
 
మీనం : దైవ సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం. రియల్ఎస్టేట్ రంగాల వారికి బిల్డర్లకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. భేషజాలకు పోకుండా ధనవ్యయంలో ఆచితూచి వ్యవహరించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు