13-09-2019- శుక్రవారం దినఫలాలు - మీ మొండివైఖరి మీకెంతో...

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (09:02 IST)
మేషం: వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. విందులలో పరిమితి పాటించండి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాహన ప్రయత్నాలు విరమించండి. మీరెదుర్కున్న సమస్య బంధువులకు ఎదురవడంతో మీ కష్టాన్ని, ఆందోళనని గుర్తిస్తారు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.
 
మిధునం: రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం: శ్రీమతిని, పిల్లలను మెప్పించటం కష్టమవుతుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. ఉద్యోగస్తులు ఎదుటివారితో సంభాషించేటపుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేస్తారు.
 
సింహం: ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతాయి. గృహ మార్పతో ఇబ్బందులు తొలిగి మానసికంగా కుదుటపడతారు. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య: ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణం ఏ కొంతయినా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి.
 
తుల: పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది.
 
వృశ్చికం: కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. క్లిష్టతరమైన పనుల్ని ఎలా అధికమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి. దంపతుల మధ్య కలహాలు, విభేదాలు తలెత్తుతాయి.
 
ధనస్సు: మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మకరం: విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. రావలసిన ధనం అందకపోవటంతో ఆందోళన చెందుతారు.
 
కుంభం: పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. రుణ యత్నాల్లో అలసత్వం వంటి చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం: ప్రముఖుల కలయిక వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆదాయం పెంచుకునే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆథిపత్యంచెల్లదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు