15-11-2018 గురువారం దినఫలాలు - మానసిక ప్రశాంతత చేకూరాలంటే...
గురువారం, 15 నవంబరు 2018 (08:54 IST)
మేషం: పోస్టల్, కొరియల్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. మీరెదురుచూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.
వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉమ్మడి, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పువు.
మిధునం: స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కుంటారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. వేడుకలు, శుభకార్యాల్లో స్త్రీలు అందరినీ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని పొగిడే వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి.
కర్కాటకం: ఆర్థిక సమస్యల వలన ఒకింత ఆందోళనకు గురవుతాయి. ఆత్మీయుల అతిధి మర్యాదలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల సంస్థలలో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
సింహం: వ్యాపారాలు, సంస్థలలో కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచించండి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువులను కలుసుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుకు వ్యసనాలకు దూరంగా ఉండండి.
కన్య: ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. వడ్డీలు, డిపాజిట్లు చేతి కందుతాయి. స్త్రీలకు ఆకాలభోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. గతంలో చేసిన తప్పిదం పశ్చాత్తాపం కలిగిస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.
తుల: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికీ, మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.
వృశ్చికం: భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలు టి.వి కార్యక్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించండి.
ధనస్సు: రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు యత్నం ఫలిస్తుంది.
మకరం: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి.
కుంభం: తరచు దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితుల్లో నూతనోత్సాహం, అనుభూతి చోటు చేసుకుంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం.
మీనం: ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. జీవితం ఆనందంగా గడిచిపోతున్నప్పటికి మీ లక్ష్యం మిమ్మల్ని ఓ కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. దైవదర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.