16-01-2020 గురువారం మీ రాశిఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తే...

గురువారం, 16 జనవరి 2020 (05:00 IST)
మేషం : బేకరీ, తినుబండరాల వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పారిశ్రామిక రంగాలలోని వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి. 
 
వృషభం : బంధు మిత్రులను ఆహ్వానిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యుల రాకపోకల వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. గృహంలో మార్పులు చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. 
 
మిథునం : నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. అనవసరపు సంభాషణల పట్ల ముఖ్యులతో ఆకస్మిక విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
కర్కాటకం : విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. యాదృచ్ఛికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
సింహం : స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. 
 
కన్య : సంఘంలో పలుకుబడిన కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం తప్పవు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులు పనివారలను కనిపెట్టడం మంచిది. 
 
తుల : దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు అధిక శ్రమ వల్ల నరాలు, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్‌లలో ఆచితూచి వ్యవహరించండి. పీచు, పోం, లెదర్ వ్యాపారులకు కలిసిరాగలదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా తగు జాగ్రత్తతో ఉండటం క్షేమదాయకం. తోటివారితో స్నేహభావంతో సంచరిస్తారు. రుణం కొంతమొత్తం తీర్చడంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. 
 
ధనస్సు : స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. తొందరపడి వాగ్ధానాలు చేయుట వల్ల మాటపడక తప్పదు. 
 
మకరం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులు తోటిపనివారలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
కుంభం : స్త్రీలకు దైవకార్యాలు, ఇతర వ్యాపకాల వైపు దృష్టి మళ్లుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి విద్యుత్ కోత, కార్మిక సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు.
 
మీనం : స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కంప్యూటర్ రంగాలవారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు వాయిదాడటం మంచిది. విద్యార్థులకు అనుకోని చికాకులు ఎదురవుతాయి. రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు