19-07-2019 శుక్రవారం దినఫలాలు - వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో...

శుక్రవారం, 19 జులై 2019 (08:46 IST)
మేషం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తడి అధికమవుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి లాభాదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. 
 
వృషభం: ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటమంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం: వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కాంట్రాక్టు దారులకు ఆందోళనలు కొన్ని సందర్భము లందు ధన నష్టము సంభవించును. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం: వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. పత్రక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు అవసరం. పాత వస్తువులను కొన్ని సమస్యలు తెచ్చుకోకండి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకుకలిగిస్తుంది. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. 
 
సింహం: స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహంచండి.
 
కన్య: ఆర్ధిక సమస్యల వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. నూతన టెండర్లు, ఏజెన్సీలు, వాణిజ్య ఒప్పందాల్లో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను అధికంగా ఎదుర్కుంటారు. దంపతుల మధ్య ప్రేమాను రాగాలు బలపడతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు.
 
తుల: ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రేమాను బంధాలు, ఉన్నతస్ధాయి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడకతప్పదు. శత్రువులపై విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. 
 
వృశ్చికం: విద్యార్థులకు టెక్నికల్, మెడికల్, ఎం.బి. ఎ, ఎం.సి.ఎ, వంటి కోర్సులో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. బ్యాంకు వ్యహారాలలో మెళుకువ వహంచండి. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో చకాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తుసామగ్రి అందజేస్తారు.
 
మకరం: వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకు లెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం.
 
కుంభం: మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు సంభవం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.
 
మీనం: ఆర్ధిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎల్. ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు, ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు