21-05-019 దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల శుభం
మంగళవారం, 21 మే 2019 (09:02 IST)
మేషం : మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలి. పెంపుడు జంతువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు టీవీ కార్యక్రమాలలో నిరుత్సాహం తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి.
వృషభం : ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. అయినవారి కోసం తాపత్రయపడతారు. మీ శ్రీమితి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
మిథునం : రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. ఏ పని తలపెట్టినా మొదటికే మోసం వస్తుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోతాయి. వాహనం ఏకాగ్రతతో నడపాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం. నిరుద్యోగులు విజయం సాధిస్తారు.
కర్కాటకం : స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. పత్రికా ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులు చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
సింహం : ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. ఒక స్థిరాస్తి విక్రయంలో సోదరీ సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. గృహ మార్పు వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది.
కన్య : కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో కొన్ని అనుకున్నవి సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
తుల : నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఆయాచితంగా వచ్చే కానుకలను సున్నితంగా తిరస్కరించండి. వృత్తుల వారికి గుర్తింపు, ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. బంధువుల ఆకస్మికరాక ఇబ్బంది కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలు, ఇసుక కాంట్రాక్టర్లకు నిరుత్సాహం అధికం.
వృశ్చికం : ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. మీ పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వార్తా సిబ్బందికి చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమం కాదు. ఉన్నత స్థాయి అధికారులకు స్థానభ్రంశం, హోదా మార్పు వంటి ఫలితాలున్నాయి.
ధనస్సు : ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవువుతారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. రాబడికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి నెలకొంటుంది. శారీరక శ్రమ అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పత్రికా ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
మకరం : నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. వ్యాపారులకు అధికారుల దాడులు, షాపు గుమస్తాల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు ఆలస్యంగా గుర్తిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
కుంభం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతతో క్షణం తీరిక ఉండదు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. వ్యాపార వర్గాల వారికి చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనం : నిరుద్యోగుల ఉపాధి పథకాలకి మంచి స్పందన లభిస్తుంది. అధికారులు ధన ప్రలోభాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి నెలకొంటుంది. కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు గడిస్తారు.