గురువారం (22-11-2018) దినఫలాలు - గత అనుభవాలు ఓ గుణపాఠంలా..

గురువారం, 22 నవంబరు 2018 (08:53 IST)
మేషం : దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించటంవల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పనిభారం తప్పదు.
 
వృషభం : ఉద్యోగస్తులు ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు, రావలసిన ధనం వాయిదా పడుతుంది. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఫైనాన్స్, చిట‌ఫండ్ రంగాల వారికి నిగ్రహశక్తి అవసరం. ఐరన్, సిమెంట్ స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక, మాట సహాయం అర్థిస్తారు. స్త్రీల లక్ష్యసాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
 
కర్కాటకం : చిన్నతరహా పరిశ్రమలలోని వారికి పురోభివృద్ధి. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. కొంతమంది మిమ్మల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.
 
సింహం : ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి అవకాశం ఉంది. ఏ విషయంలోనూ మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలం అవుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచటం మంచిది. ఇతరులకు వాహనం ఇవ్వటంవల్ల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యులతో సంభాషించేటప్పుడు మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
తుల : గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులవల్ల సమస్యలు తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసి రాగలదు.
 
వృశ్చికం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికం అవుతాయి. స్త్రీలకు పనిభారం అధికం కావటంతో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటుతనం మంచిది కాదని గ్రహించండి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
 
ధనస్సు : ఉపాధ్యాయులకు విద్యార్థులవల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తవచ్చు, జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాలలోని వారికి కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం : పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒంటెత్తుపోకడ మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ వహించండి. వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలయికవల్ల గృహంలో సందడి కానవస్తుంది.
 
కుంభం : స్త్రీలు దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి.
 
మీనం : కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన కుదరదు. విద్యార్థులకు విద్యా విషయాలపట్ల ఏకాగ్రత అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు