23-02-2019 - శనివారం మీ రాశిఫలితాలు - ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు...
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (09:55 IST)
మేషం: కుటుంబంలో ఖర్చుల నిమిత్తం ఎక్కువ ధనం వెచ్చించవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
వృషభం: భాగస్వామి వ్యాపారాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్ళల్లో సౌమ్యంగా మెలగాలి.
మిధునం: హోటల్ తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. ఖర్చులు పెరిగినా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులరాకతో గృహంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారు మీ సహాయం అర్ధిస్తారు.
సింహం: ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయి. దంపతుల మధ్య అవగాహనలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. ఆప్తుల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
కన్య: ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు ఎదురవుతాయి. మీ మాటకు వ్యతిరేకత, అపఖ్యాతి వంటి చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులకు ఊహించన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు వేస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి.
తుల: దైవ, సేవా సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. రుణయత్నం ఫలించి ధనం చేతికందుతుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. విద్యార్థుల్లో భయాందోళనలు చోటు చేసుకుంటాయి.
వృశ్చికం: నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. బంధువుల రాకతో ఇబ్బందులెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలం. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ప్రతికూలతలు ఎదురవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
ధనస్సు: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. దూరప్రయాణాలు చేయవలసివస్తుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ దృక్పథం బలపడుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
మకరం: ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ధనసహాయం అర్థించడానికి అభిజాత్యం అడ్డువస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
కుంభం: ఉద్యోగస్తులకు శ్రమ పనిభారం అధికమైన మునుముందు సత్ఫలితాలు ఉంటాయి. స్త్రీలు రచనా వ్యాసంగాలు, కళలకు సంబంధించిన పోటీలలో రాణిస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. రుణాల కోసం అన్వేషిస్తారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు.
మీనం: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పాత రుణాలు తీరుస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వలన ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు.