23-09-2018 ఆదివారం దినఫలాు - స్త్రీలకు చుట్టప్రక్కల వారి నుంచి..

ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (09:11 IST)
మేషం: హోటల్, తినుబండారాలు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
వృషభం: ధనం ఎంత సంపాదించినా నిలువుచేయలేరు. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రియతములు ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపార వర్గాలవారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలకు చుట్టప్రక్కల వారి నుండి గుర్తింపు లభిస్తుంది.
 
మిధునం: మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. అందరూ కలిసి విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.
 
కర్కాటకం: ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. భూ, చేపట్టిన పనుల్లో స్వల్ప ఒత్తిడి, ఆటంకాలు తప్పవు. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
 
సింహం: మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాకతో స్త్రీలు పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధఇక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. గృహ, వాహనయోగాలు సిద్ధిస్తాయి. స్త్రీలు అకారణంగా మాటలు పడే ఆస్కారం ఉంది జాగ్రత్త అవసరం.
 
కన్య: పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వాయిదా పడుతాయి. పెద్దమెుత్తం ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త అవసరం.
 
తుల: అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నూతన పరిచయాలు విస్తరిస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. అవివాహితులకు శుభదాయకం.
 
వృశ్చికం: ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు: రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మీ పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. విశ్రాంతిలోపం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
మకరం: వ్యాపారాల అభివృద్ధికి మరింత శ్రమించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు.
 
కుంభం: కార్యసిద్ధి మనోవాంఛలు నెరవేరుతాయి. పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదుర్కుంటారు. బంధుమిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
 
మీనం: ఆత్మీయులను కలుసుకుంటారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమ ఫలిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆరోగ్యంలో సంతృప్తి. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. ప్రయాణం తలపెడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు