గురువారం (24-10-2019) రాశిఫలాలు - స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి...
గురువారం, 24 అక్టోబరు 2019 (09:10 IST)
మేషం : మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం.
వృషభం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. భార్యా, భర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి అనుకున్నది సాధిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. సంఘంలో మీకు పేరు, ఖ్యాతిలభిస్తుంది.
మిథునం : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఓర్పు, శ్రమాధిక్యతతోచేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రవాణా రంగాలవారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య రంగాలవారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. కొబ్బరి, పండ్ల, పూల, తమలపాకులు, వ్యాపారాలకు లాభదాయకం.
కర్కాటకం : శత్రువులపై జయం పొందుతారు. వ్యాపారాలలో ధనం లాభిస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి కొత్త సమాచారం అందుతుంది. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విద్యుత్ బిల్లులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు, బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం.
సింహం : రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంమంచిది. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చుక్కెదురవుతుంది.
కన్య : దంపతుల మధ్య కలహాలు తొలగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ రీత్య ధనవ్యయం మానసిక ప్రశాంతత కరువగును. ఏదైనా అమ్మాకానికై చేయు ఆలోచనవాయిదా వేయటం మంచిది. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం శ్రేయస్కరం.
తుల : సేల్స్ సిబ్బంది, కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. బంధు, మిత్రులతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆలోచనలతో భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీ పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉపాధ్యాయులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శాస్త్రసంబంధమైన విషయాలు ఆసక్తిని చూపుతాయి.
వృశ్చికం : మీ అత్యుత్సాహం అనర్ధాలకు దారితీస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు తోటివారి వల్ల మాటపడవలసివస్తుంది. పందాలు, పోటీలలో జాగ్రత్త అవసరం. పాతఋణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటుంగ్లు అందుకుంటారు.
ధనస్సు : ఒక వ్యవహారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందిస్తారు. బదిలీలు, మార్పులు చేర్పుల గురించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
మకరం : విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రాజకీయల రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నారులు మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
కుంభం : బ్యాంకు వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. అంతగా పరిచయం లేనివారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకొండి. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమత్తులు చురుకుగా సాగుతాయి.
మీనం : దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. మనోధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. కొంత మది సూటిపోటి మాటలుపడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.