25-12-2019 బుధవారం మీ రాశి ఫలితాలు..

బుధవారం, 25 డిశెంబరు 2019 (06:00 IST)
ఇష్టదైవాన్ని పూజించినా, ఆరాధించినా మీకు సంకల్పసిద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం: ఆత్మీయులకు శుభాకాంక్షలు అందజేస్తారు. బంధువులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆహార వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగులుతుంది. దీంతో పొదుపు సాధ్యం కాదు. 
 
వృషభం: విందు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. మిత్రుల రాకవల్ల అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నూతన వస్తువుల పట్ల, వస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
 
మిథునం: కొబ్బరి, పండ్ల, పూల, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ముఖ్యుల కలయిక మానసిక సంతృప్తినిస్తుంది. రుణయత్నాలు. చేబదుళ్లు తప్పవు. బంధువుల రాకతో కుటుంబంలో సందడి నెలకొంటుంది. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి ఉంటుంది. 
 
కర్కాటకం: ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా వుంటాయి. మొహమ్మాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. కొంతమంది మీ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు పనిభారం వల్ల అధిక ఒత్తిడి తప్పదు.
 
సింహం: కుటుంబీకుల మధ్య ఆత్మీయ అనురాగాలు బలపడతాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. ఖర్చులు రాబడికి తగినట్టుగానే వుంటాయి. వృత్తులు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. విద్యార్థినులకు నూతన పరిచయాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య: స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. అధిక ఖర్చులు, శ్రమ ఎదుర్కొన్నప్పటికీ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొని వుంటుంది. వృత్తి వ్యాపారాలకు అన్ని విధాలా అనుకూలం. ఆశ వదిలేసుకున్న ఒక అవకాసం మీకే అనుకూలిస్తుంది. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు.
 
తుల: వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఖర్చులు అధికంగా వుంటాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: కొబ్బరి, పండ్ల,  పూల, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. ప్రతి పనిలోను ఉత్సాహం కనబరుస్తారు. అదనపు ఆదాయం కోసం నూతన మార్గాలు అన్వేషిస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి.
 
ధనస్సు: కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. స్త్రీలకు అయిన వారి నుంచి ధనసహాయం అందుతుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. బంధుమిత్రులతో పరస్పర కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు భారీగా ఉన్నా మీ ఆర్థికస్థితికి ఏమాత్రం లోటుండదు.
 
మకరం: ప్రతి విషయంలోను అనుభవజ్ఞులను సలహా పాటించడం మంచిది. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. స్త్రీలకు వస్త్ర, వస్తులాభం, వాహనయోగం వంటి శుభ సంకేతాలున్నాయి. విద్యార్థుల్లోను మనోధైర్యం నెలకొంటుంది. పాత మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. 
 
కుంభం: ముఖ్యమైన పత్రాలు, అందుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. శుభాశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ముఖ్యమైన వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. విద్యార్థినులకు ఏకాగ్రత నెలకొంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. 
 
మీనం: ఆదాయ వ్యయాలు సంతృప్తికంగానే ఉంటాయి. వృత్తులు, వ్యవసాయ కూలీలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పత్రికా రంగంలోని వారికి ఆందోళన తప్పదు. గృహంలో ఒక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భాగస్వామిక చర్చలు, మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు