27-06-2020 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణ స్వామిని ఆరాధిస్తే... (Video)

శనివారం, 27 జూన్ 2020 (05:00 IST)
మేషం : కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. తరచూ దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపార ప్రకటనలపై అవగాహన చాలా అవసరం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాల నిరుత్సాహపరుస్తాయి. 
 
వృషభం : మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. 
 
మిథునం : కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. విందులలో పరిమితి పాటించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత చాలా అవసరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో మిత్రులు, మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. 
 
సింహం : అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. గతంలో జరిగిన తప్పుల వల్ల మంచిని నేర్చుకోండి. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన ప్రదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. 
 
తుల : రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రచయితలకు, పత్రికా రంగంలోకి వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు చేబదుళ్లు తప్పవు. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారిపట్టించే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. 
 
వృశ్చికం : కార్యసాధనలో శ్రమాధిక్యత, ఆటంకాలను ఎదుర్కొంటారు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనకు వస్తారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. 
 
ధనస్సు : ఎప్పటి సమస్యలను అపుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. స్త్రీలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 
 
మకరం : మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రావలసిన ధనం అందడంతో ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. 
 
కుంభం : ప్రేమికుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. షేర్ల క్రయ, విక్రయాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : ఆర్థిక పరిస్థితి కొంత మేరుక మెరుగుపడుతుంది. స్త్రీలు, ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు