30-10-2018 మంగళవారం దినఫలాలు - మీ శ్రీమతి మెుండివైఖరి మనస్థాపం..

మంగళవారం, 30 అక్టోబరు 2018 (08:40 IST)
మేషం: కుటుంబ సభ్యులు, అయిన వారి సహాయ సహాకారాలు లభిస్తాయి. గత అనుభవంతో ఒక సమస్యను అధిగమిస్తారు. స్త్రీలు కొన్ని కారణాల వలన మాటవలసివస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోవారికి అనుకూలం. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. లక్ష్య సాధనకు సానుకూల భావంతో యత్నాలు సాగించండి. 
 
వృషభం: వ్యాపారులు పనివారల తీరును గమనిస్తుండాలి. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమెుత్తం నగదు తీసుకునే విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల బదిలీ ఉపశమనం కలిగిస్తుంది. సేవ సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం, బాధ్యతల మార్పు తప్పవు.  
 
మిధునం: సంగీత, నృత్య కళాకారులకు ప్రశంలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం కానవస్తుంది. మీ శ్రీమతి మెుండివైఖరి మనస్థాపం కలిగిస్తుంది.  
 
కర్కాటకం: ఓర్పుతో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులు, సహోద్యోగుల మాటతీరు ఆందోళన కలిగిస్తాయి. దైవకార్యాలు, దీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు సరుకు నిల్వలో జాగ్రత్త వహించాలి. గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.  
 
సింహం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి అవమానాలను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం వలన ఆందోళన ఏర్పడుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పత్రిక, ఎలక్ట్రానిక్, మీడియా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువులు, అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది.   
 
కన్య: కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. రావలసిన ధనం వాయిదా పడుతుంది. ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  
 
తుల: ఉపాధ్యాయులు అపరిచిత వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించి సంభాషించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యేక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది.     
 
వృశ్చికం: ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాభంగం. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఊహించని ఖర్చుల వలన ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవ ఉండదు.  
 
ధనస్సు: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులెదుర్కోవలసి వస్తుంది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండడం ఉత్తమం.   
 
మకరం: స్త్రీలకు పొరుగువారిలో గుర్తింపు లభిస్తుంది. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యాల ప్రభావం అధికం. ప్రేమికుల అత్యుత్సాహం అనార్దాలకు దారితీస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ప్రయత్నపూర్వకంగా కొన్ని వ్యవహారాలు సానూకూలమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.  
 
కుంభం: కొబ్బరి, పండ్లు, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన ధనంలో కొంత మెుత్తం అందుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్టాక్‌మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.  
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల ప్రతిభకు గుర్తింపుల, సదవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు కలిసిరాగలదు. బంధువులకు ఆర్థికసాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.       

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు