గురువారం (31-10-2019) దినఫలాలు - మీ వ్యాఖ్యలను బంధు మిత్రులు...

గురువారం, 31 అక్టోబరు 2019 (06:25 IST)
మేషం : రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. మిత్రుల కలయిక సన్నిహితుల సలహాలు మీలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. కొత్త రుణాలు అన్వేషిస్తారు.
 
వృషభం : ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ విభాగాల వారి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయ రంగాలలో వారికి మెళకువ అవసరం. లాయర్లు పురోభివృద్ధి పొందుతారు.
 
మిథునం : మీ వ్యాఖ్యలను బంధుమిత్రులు అపార్ధం చేసుకుంటారు. వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. స్త్రీలపై చుట్టుపక్కల వారి మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు.
 
కర్కాటకం : కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. క్రయ, విక్రయాలు సామాన్యం.
 
సింహం : బ్యాంకింగ్ వ్యవహారాలలోను, ప్రయాణాలలోము అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు వాయిదా వేయటం మంచిది. చేతి వృత్తుల వారికి లాభదాయకం.
 
కన్య : ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నూతన దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. పత్రిక ప్రవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలించవు. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
తుల : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. కొంత మంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్ధిస్తారు. అరుదైన శస్త్రచికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. వస్తువులను అమర్చుకుంటారు.
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మిత్రుల కలయికతో గత కాలం జ్ఞపకాలు గుర్తుకొస్తాయి.
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందంన లభిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన మేలు పొందుతారు. ఉద్యోగస్తులు తోటివారి సహాయాన్ని పొందుతారు.
 
మకరం : ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. పారశ్రామిక రంగంలోని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. రుణ, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. భార్య, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి.
 
కుంభం : ఆత్మీయుల గురించి ప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రేమికులకు చికాకులు అధికం.
 
మీనం : నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. విదేశీయానం కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత, బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. రావలసిన ధనం వసూలు కోసం బాగా శ్రమిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు