శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 01-10-17

ఆదివారం, 1 అక్టోబరు 2017 (05:57 IST)
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. సమర్థతకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. 
 
వృషభం : కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు మంచిదికాదు అని గమించండి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు లాభిస్తాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డుచెప్పడం మంచిదికాదు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. 
 
మిధునం : ఆధ్మాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉపాధ్యాయుల విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధువులను విందుకు ఆహ్వానిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వాగ్దాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. 
 
సింహం : కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో గృహ వాతావరణం సంతృప్తినిస్తుంది. మత్స్యు కోళ్ల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలకు పనివారితో సమస్యలను ఎదుర్కొంటారు. చేతిలో ధనం నిలబడదు. 
 
కన్య : ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీపై సెంటిమెంట్లు, బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ అధికమవుతుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
తుల : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. అపార్థాలుమాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. స్త్రీల సృజనాత్మకతకు ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువులకు పెట్టిపోతల విషయంలో పెద్దల సలహా పాటించడం ఉత్తమం. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. 
 
ధనస్సు : మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులు తొలగిపోతాయి. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతి వైఖరి సంతోషపరుస్తుంది. 
 
మకరం : వేడుకల్లో పాల్గొంటారు. అపార్థాలుమాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. 
 
కుంభం : ప్రియతముల గురించి ఆరాటం చెందుతారు. మీ మేలు పొందిన వారే మీపై ఆభాండాలు వేసేందుకు యత్నిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. బంధువుల అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
మీనం : ఆత్మీయులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. కార్యసాధనకు ఓర్పుతో ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు