ఈ రోజు (శనివారం) దినఫలాలు.. మీపై శకునాల ప్రభావం? (వీడియో)

శనివారం, 20 జనవరి 2018 (08:27 IST)
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల  సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు ఉండవలసి వస్తుంది. ఓర్పుతో, నేర్పుతో అన్నింటినీ నెట్టుకొస్తారు. 
 
వృషభం : ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. అధికారులకు తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు తగిన ప్రతిఫలం ముడుతుంది. పనులు కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. స్త్రీల కోరికలు అవసరాలు నెరవేరగలవు. 
 
మిథునం : రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. గృహమరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాడతాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు ప్రభావం అధికం. 
 
కర్కాటకం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలు జరిగే అవకాశమే అధికం షాపుల అలంకరణ, కొత్త కొత్త స్కీములతో వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు సెలవులు, పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. లీజు, కాంట్రాక్టుల గడువు పొడగింపులకు అనుకూలం. 
 
సింహం : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుటడం వల్ల కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉండవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కన్య : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. కావలసిన వస్తువు సమాయానికి కనిపించక పోవడంతో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ పెద్దల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
తుల : ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం వల్ల ఆందోళన తప్పదు. ఇతర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. మాట్లాడలేనిచోట మౌనంగా ఉండటం మంచిది. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. వైద్యులకు ఏకాగ్రత అవసరం. షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధువులు వ్యతిరేకిస్తారు. కోర్టు వ్యాజ్యాలు విచారణకు వస్తాయి. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొంతమంది మిమ్మలను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ప్రభుత్వ కార్యాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగలవలసి ఉంటుంది. రాజకీయ నేతలు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. 
 
మకరం : బంధువులను సహాయం అర్థించడానికి మొహమ్మాటం అడ్డువస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. యాదృచ్ఛికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పలు తప్పవు. 
 
కుంభం : నిరుద్యోగులు ఏ విషయాన్ని అలక్ష్యం చేయక ఆశాభావంతో శ్రమించిన సత్ఫలితాలు పొందగలరు. ముక్కుసూటిగా పోయే మీ స్వభావం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. మీ శ్రీమతి ఇష్టాయిష్టాలను వ్యతిరేకించడం మంచిది కాదని గమనించండి. కీలకమైన పత్రాల విషయంలో సమాచారం అందుకుంటారు. 
 
మీనం : బెట్టింగ్‌లు జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు