#DailyPredictions 25-08-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు

ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:13 IST)
మేషం: ఆర్ధిక విషయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ ఓర్పు, పట్టుదల ఇతరులకు ఆదర్శమవుతుంది. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు.
 
వృషభం: మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. స్ధిరాస్తి అమ్మకం పై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించి ప్రయోజనం ఉండదు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. సొంతంగా గృహం ఏర్పచుకోవాలనే కోరిక బలీయమవుతుంది.
 
మిధునం: ఒకేసారి అనేక ఖర్చులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. సంఘంలో వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. మీ ఆశయాలు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది.
 
కర్కాటకం: దంపతుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. చేసిన ఉపకారానికి గుర్తింపు లేక పోగా మాటపడవలసి వస్తుంది. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. స్త్రీలకు ఊహించని సనస్యలు తలెత్తుతాయి. రాజకీయాలలో వారు సభ, సమావేశాలలో పరిష్కార మార్గం గోచరిస్తుంది.
 
సింహం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. పెద్దమొత్తం ధనంతో  ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
 
కన్య: వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. పత్తిక, వార్తా మీడియా ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించంకండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం.
 
తుల: కుటుంబసభ్యులతో స్వల్ప విభేధాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. ఎంతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది.
 
వృశ్చికం: స్త్రీలు అతిగా సంభాషించడం వల్ల అపార్ధాలకు లోనయ్యే అవకాశం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పొరపాట్లు సరిదిద్దుకోవటం క్షేమదాయకం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు: పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. దూరప్రయాణాలలో చికాకులు తలెత్తుతాయి. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే  స్త్రీల మనోవాంఛ ఫలిస్తుంది. కీలకమైన సమావేశాల్లో మితంగా సంభాషించండి. 
 
మకరం: ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ ఆలస్యము, అశ్రద్ధ వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. సోదరులతో మనస్పర్థలు తలెత్తే ఆస్కారం ఉంది. రాజకీయాలలో వారికి ఒక సమాచారం ఎంతో ఆనందం కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అప్రమత్తత అవసరం. 
 
కుంభం: పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు ప్రయోజనకరంగా ఉంటాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సంఘంలో గుర్తింపు పొందుతారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన బలపడుతుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా వేయటం మంచిది.
 
మీనం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రయాణాలలో చికాకు, అసౌకర్యానికి గురవుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. స్త్రీలపై సెంటిమెంట్లు, ఇతరుల వ్యాఖ్యలు ప్రభావం అధికం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు