ఫిబ్రవరిలో మీ రాశి ఫలితాలు (01-02-2018 నుంచి 28-02-2018 వరకు)
బుధవారం, 31 జనవరి 2018 (22:27 IST)
6వ తేదీ శుక్రుడు కుంభం నందు, 12వ తేదీ రవి కుంభం నందు, 14వ తేదీ బుధుడు కుంభం నందు ప్రవేశం. 1వ తేదీ సంకటహర చతుర్థి, 11వ తేదీ సర్వ ఏకాదశి, 13వ తేదీ మహా శివరాత్రి, 17వ తేదీ చంద్ర దర్శనం, 19వ తేదీ శుక్రమౌఢ్యమి త్యాగం, 26వ తేదీ సర్వ ఏకాదశి.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
బంధుత్వాలు, వ్యాపకాలు బలపడతాయి. వివాహ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆప్తుల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికపై దృష్టి సారించండి. ఆర్థికస్థితి ఆశాజనకం. కొన్ని ఇబ్బందులు సర్దుకుంటాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు యత్నం కలిసివస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్ర వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ఈ మాసం అనుకూలదాయకం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నగదు స్వీకరణలో జాగ్రత్త. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు లొంగవద్దు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు.
ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనమూలక సమస్యలు తొలగుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అధికం, ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. రుణదాతల ఒత్తిడి అధికం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థిక లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. యత్నాలు ప్రోత్సాహకరం. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనుల ప్రారంభంల ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి, ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది.
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. విజ్ఞతతో వ్యవహరించండి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బాధ్యతలు, వ్యవహారాలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో మార్పులు చేపడతారు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. వృత్తుల వారికి జన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ద్విచక్ర వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆశీస్సులు, ప్రశంసలు అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. పెట్టుబడుల సమాచారం. అందుతుంది. భాగస్వామికులతో చర్చలు జరుపుతారు. మీ నిర్ణయాలు ఖచ్చితంగా తెలియజేయండి. వ్యాపారులు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం యోగదాయకమే. గృహంలో సందడి నెలకొంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. వేడుకలు ఘనంగా చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించవచ్చు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు సామాన్యం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు.
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆర్థికస్థితి సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఖర్చులు భారమనిపించవు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యవహారానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం, వాహన యోగం ఉన్నాయి. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. ఆర్థిక, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం. ఉత్సాహాన్నిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. గృహ మారపు కలిసివస్తుంది. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు.
ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. అంచనాలు తారుమారవుతాయి. సహాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు వాయిదాపడతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. చిరు వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఆకస్మిక స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
ధనలాభం ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. శుభకార్యాన్ని ఆడంబరంగా చేస్తారు. అయినవారి రాక సంతోషాన్నిస్తుంది. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు సకాలంలో పూర్తి చేస్తారు. పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులను కలుసుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆస్థి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.