నీరసంగా ఉందా..? అయితే మిరపకాయ, ఉప్పుతో దిష్టి తీసుకుంటే..?

సోమవారం, 23 జనవరి 2017 (12:03 IST)
నీరసంగా ఉందా..? ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్నారా? అలసట ఆవహించిందా? అయితే వెంటనే మిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీయించుకోండి.. అంటున్నారు పంచాంగ నిపుణులు. నిప్పుతో కూడిన గరిటలో మూడుసార్లు మిరపకాయలతో, ఉప్పుతో దిష్టి తీయించుకుంటే ఇలాంటి రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు.

అలాగే మిరపకాయ, ఉప్పుతో దిష్టి తీయించుకుంటే.. సోడియం క్లోరైడ్ విడిపోయి సోడియం పెరాక్సైడ్‌గా, క్లోరిన్‌గా మారిన వాటిని పిల్చటం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన ఆ వాయువు శరీరంలో ప్రవేశించటంతో శ్వాసమండలం రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి కలుగుతుంది. పెద్దలు పెట్టిన ఏ ఆచరంలోనైనా, సాంప్రదాయంలోనైనా ఎంతో జ్ఞానం వుందని గమనించాలి.

ఇంకా ఉప్పు, చెప్పులు, చీపురు, ఉప్పు-మిరపకాయ-బట్ట వంటి మూడింటితో దిష్టి తీయించుకుంటే దోషాలు నివృత్తి అవుతాయి. ఇంకా కర్పూరంతో దిష్టి తీసుకుంటే కూడా ఇతరుల దృష్టి ప్రభావంతో ఏర్పడే రుగ్మతల నుంచి పిల్లలు, పెద్దలు బయటపడవచ్చును. 
 
అలాగే చిన్న పిల్లలకు దృష్టి దోషాలు తగులకుండా ఉండాలంటే శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకం చాలునని పండితులు అంటున్నారు. విభూతిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల నుదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాస్తే ... దృష్టిదోషాలు తొలగి, సర్వ గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి. 
 
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
 
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II
 
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అంటూ ఈ మంత్రంతో పిల్లల దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి