కాలాష్టమి రోజున భైరవ దేవాలయంలో పచ్చిమిర్చి, ఆవనూనె, కొబ్బరి, శెనగలు దానం చేయాలి. కాలాష్టమి రోజున, భైరవుని చిత్రం లేదా విగ్రహం ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి, శ్రీకాల భైరవ అష్టకం పఠించాలి.
కాలాష్టమి రోజు పొరపాటున కూడా కుక్కలను హింసించకండి. కాలాష్టమి రోజున కాల భైరవుడిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం ద్వారా భక్తుల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు.