కుజుడు శత్రు, రోగ, రుణములకు, సహోదరులకు కారకుడు. కుటుంబ కలహాలు, కత్తుల వలన గాయాలు, శత్రుబాధలు, అవమానాలు, నుదురు, కండరములు. రక్తము పడుట, అంటువ్యాధులు, ఆపరేషన్లు, శిక్షలు పడుట మొదలగునవి జరిగినప్పుడు కుజబలం లోపించినట్లు గుర్తించాలి.
9 7 5
4 1 6 మంగళవారం రాత్రి కుజహోరయందు అనగా రాత్రి వేళలో తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ధరించాలి. ప్రతినిత్యం ఉదయము స్నానంచేసి శుచిగా అంగారక ధ్యానం 21సార్లు చెయ్యాలి. మంత్రజపం 108మార్లు జపించి, పైన తెలిపిన ప్రకారము యంత్రాన్ని పూజించి ధరించాలి. 21 మంగళవారాలు కందులు దానమివ్వాలి.
మంగళవారం రోజు చాలా నిష్ట నియమంగా వుండి, అభ్యంగన స్నానం చేయడం, రాత్రి భోజనం, సంభోగం, మంచంపై పరుండటం, స్త్రీలను హింసించడం, మాంసాహారం తినడం, దైవనింద వంటివి చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.