చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు..?

శుక్రవారం, 27 అక్టోబరు 2023 (20:23 IST)
సూర్యుడు- చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిని కప్పివేస్తుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29న జరగనుంది. అక్టోబర్ 29-న తేదీ తెల్లవారుజామున 01. 05 నిమిషానికి మొదలై 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ముగుస్తుంది. 
 
చంద్ర గ్రహణం సంభవించడానికి కొన్ని గంటల ముందు ఆలయాలన్నీ మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రపరచడం, పరిహార పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనం చేసుకోవచ్చు. 
 
పౌర్ణమి, అశ్విని నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడటం ఉండటం వల్ల రేవతి, అశ్విని, భరణి, రోహిణి, నక్షత్రాలలో పుట్టినవారు గ్రహణం ముగిసిన తర్వాత ఉదయం పూట దీపారాధన చేయడం మంచిది. గ్రహణ సమయంలో తినడం, నీరు త్రాగుట చేయకూడదు. 
 
అలాగే ఆహార పదార్థాలలో దర్భలను వేసి వుంచాలి. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని చాలామంది భావిస్తారు.
 
ఈ చంద్రగ్రహణం శరద్ పూర్ణిమతో కలిసిన చంద్రగ్రహణం కావడంతో ప్రతికూలమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఈ చంద్ర గ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశుల వారికి అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు