పండు వెన్నెలలో విహరిస్తున్నట్లు కలగాంచితే?

శుక్రవారం, 23 జనవరి 2015 (17:59 IST)
కలలో వెన్నెలలో తిరిగినట్లు, చంద్రుడు ప్రకాశవంతముగా కనబడితే అనుకూల దాంపత్యము, ధనలాభము కలుగును. పండు వెన్నెలలో విహరిస్తున్నట్లు కలగాంచినట్లైతే కూడా అన్యోన్య దాంపత్యము, భార్యాభర్తల మధ్య సుఖసంతోషాలు చేకూరుతాయి. 
 
చంద్రకిరణములు తన తలచుట్టుతా వ్యాపించి యుండునటుల కలవచ్చినట్లైతే పేరు ప్రఖ్యాతలు, గౌరవ ప్రతిష్టలు, అధికార ప్రాప్తి కలుగును. చంద్రుడు మనుష్య వేషములో కనిపించి అందమైన ముఖ వర్చస్సుతో ప్రకాశిస్తున్నట్లు కలగాంచినచో త్వరలో సంతాన ప్రాప్తి కలుగును. 

వెబ్దునియా పై చదవండి