నవగ్రహ దోషాలు: తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే!?

శనివారం, 19 జులై 2014 (16:13 IST)
నవగ్రహ దోషాల నివారణకు గణపతిని పూజిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి దోషాన్నైనా తొలగించుకోవాలంటే గణేశ ఆరాధన చేయాల్సిందేనని వారు అంటున్నారు. 
 
ముఖ్యంగా నవగ్రహ దోషాల్లో ఏ దోషానికైనా గణపతి పూజ ఎంతో మేలు చేస్తుంది. 
 
* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో గణపతిని పూజిస్తే సత్ఫలితాన్నిస్తుంది. 
 
* అలాగే కేతు దోష నివారణకు తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని పూజిస్తే సరిపోతుంది.
 
* చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. 
 
*  కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
* గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. 
*  బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. 
* శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి
* రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
ఇంకా స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు. 
పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. 
పగడపు గణపతి పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి