తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు..

గురువారం, 29 సెప్టెంబరు 2022 (10:18 IST)
Gayathri Devi
గాయత్రి మాత అంటే న గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వచనము-అనగా తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రమూ లేదు అని భావం. గాయత్రి మంత్రం మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. 
 
గాయత్రి అనే పదం 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్‌ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. గాయత్రి మాత అంత క్షతి మంతురాలు కాబట్టి పిల్ల పెద్దలు అందరు ఈ రోజు గాయత్రీ మాతను దర్శించుకొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలి. 
 
ఈ రోజు అమ్మ వారికీ  కాషాయ లేదా నారింజ రంగు చీరతో అలంకరణ చేసి కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం, అల్లం గారెలు నివేదిస్తారు. ఈ రోజు గాయత్రి మాతను దర్శించుకుంటే.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు