అడవి మృగాలు జవాసాలు బాట పడతాయి. పట్టణాలు, పల్లెల్లో తిరుగుతాయి. అడవులు, అరణ్యాల్లో మంటలు ఏర్పడి.. రోజుల తరబడి మండుతాయి. కృష్ణానది మధ్యలో రథం కనబడుతుంది. ఆ రథాన్ని చూసిన వారి కళ్లు పోతాయి. రెండు బంగారు హంసలు భూమి మీద తిరుగుతాయి. అతిశతో వాటిని పట్టుకోవాలనుకునేవారు నాశనం అవుతారు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం పర్వతంపై మొసలి సంచరిస్తుంది. ఆ మొసలి 8 రోజులు ఉండి భ్రమరాంభ గుడిలో చేరి మేకపోతులా అరిచి మాయమవుతుంది. తూర్పు దేశమంతా నవ నాగరికత పేరుతో విచ్చలవిడి తనం పెరుగుతుంది. అధికంగా ధనం సంపాదించినవారు తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు. ఇత్తడి బంగారం అవుతుంది. వివాహాల్లో కులగోత్రాల పట్టింపులను వదులుతారు.