ఏ రోజైనా ఉదయం.. 9 గంటల్లోపే పూజ పూర్తి చేయాలట!

సోమవారం, 15 డిశెంబరు 2014 (18:34 IST)
ఏ రోజైనా సరే.. ఉదయం.. 9 గంటల్లోపే పూజ పూర్తి చేయాలని  పురోహితులు అంటున్నారు. స్నానాదులను పూర్తి చేసుకుని, ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని 9లోపు పూజ చేసేవారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
అలాగే ఆకలికి ఆగలేక అల్పాహారం తీసుకునేవారు, తలస్నానం చేసి పూజలో కూర్చోవచ్చు. అయితే ఆకలిని తట్టుకునే వారు మాత్రం పూజ చేశాక అల్పాహారం తీసుకోవడం ఉత్తమమని పండితులు సలహా ఇస్తున్నారు. తొమ్మిది గంటల తర్వాత చేసే పూజ సాధారణ ఫలితాలు ఇస్తాయి. 
 
ఒకవేళ జాప్యం జరిగిపోతే 12 గంటల్లోపూ పూజలు చేసుకోవచ్చునని, మిట్టమధ్యాహ్నంలో పూజ చేయడం మంచిది కాదని పురోహితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి