దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, కుజ దోషం వున్నవారు, శత్రువులు ఎక్కువగా వున్నవారు , వివాహం కాక ఇబ్బందిపడేవారు, సంతానం లేనివారు ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ, సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకూ, శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు రాహు కాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమూలిక తైలంతోగానీ, నవమూలిక తైలంతోగాని లేదా నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేసిన విశేష ఫలితములు కనిపిస్తాయి. ఈ సమయంలో దుర్గా అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయాలి. ఇలా చేస్తే దోషములు పోయి అనుకున్నవి నెరవేరుతాయి.