సంకష్టహర చవితి: గరికపూజ, మోదకాలు, ఖర్జూరాలు...

గురువారం, 13 అక్టోబరు 2022 (07:00 IST)
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయానికి చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి.  
 
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.
ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
 
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.
ఖర్జూరాలు, రెండు వక్కలు, మోదకాలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
 
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
 
గరిక పూజను చేసుకోవచ్చు.  
సూర్యుడు అస్తమించిన తరువాత వినాయక పూజ చేసి.. చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని విశ్వాసం.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు